సి-విటమిన్ తో బోలెడు ఉపయోగాలు
- October 13, 2022విటమిన్ -సి మన ఆరోగ్యానికి మంచి దోస్తీ .చర్మానికి సి-విటమిన్ అవసరం చాలా ఉంటుంది.. చర్మ ఆరోగ్యమే కాకుండా సౌందర్యానికి ఇది చాలా అవసరం.. ఇంతకీ సి-విటమిన్ ఎందులో ఎక్కువ దొరుకుతుంది? సి- విటమిన్ వుండే ఆహార పదార్ధాలను సరైన మోతాదులో తీసుకుంటే సరి. నారింజ, నిమ్మ, బెర్రీస్ తింటే చర్మానికి మంచిదియు.. సి-విటమిన్ శరీరం ఉత్పత్తి చేయలేదు.. కచ్చితంగా మనం దాన్ని ఆహారం నుంచే తీసుకోవాలి..
సి-విటమిన్ వలన ఇమ్మ్యూనిటి పెరుగుతుంది.. రక్తపోటు రాకుండా అదుపుదల చేస్తుంది… గుండె వ్యాధుల సమస్య ఉండదు.. సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల వాళ్ళ కణాలు పాడైపోకుండా ఉండటానికి విటమిన్ -సి అవసరం ఉంటుంది.. అలాగని సన్ స్క్రీన్ లా పనిచేయదు.. చర్మం మీద ఉండే నల్ల మచ్చలు, పొడల్లాంటి హైపర్ ఫిట్ మెంటేషన్ సమస్య ఉండదు.. చర్మం మెత్తగా మెరుపు వచ్చేందుకు ఇది ఉపయోగ పడుతుంది..
సాధారణంగా యాంటీ ఏజింగ్ క్రీముల్లో విటమిన్ -సి ఓ పవర్ ఫుల్ ఇంగ్రిడిఎంట్ .. ఊరికే క్రీములు ముఖానికి రుద్దుకోవటం వలన ఉపయోగం లేదు… ఖచ్చితంగా నాణ్యమైన డైట్ పాటించాలి.. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి… విటమిన్ -సి వలన కొల్లాజిన్ ఉత్పత్తి అయి చర్మానికి తగిలిన గాయాలు త్వరగా మానిపోతాయి.. ఇక స్కిన్ టోన్ కు తిరుగు ఉండదు.. సిట్రస్ వుండే పండ్లు నిమ్మ, నారింజ, బెర్రీ లోనే విటమిన్ – సి ఉంటుంది.. వీటితో పాటు కొత్తిమీర, రెడ్ పెప్పర్, బ్రొకోలీ వంటి వాటిలో సి-విటమిన్ అధిక శాతం ఉంటుంది..
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు