6 రోజుల మలేషియా, సింగపూర్ పర్యటనకు ముప్పవరపు వెంకయ్యనాయుడు
- October 13, 2022
న్యూఢిల్లీ: 6 రోజుల మలేషియా, సింగపూర్ పర్యటనకు గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బయలుదేరి వెళ్ళనున్నారు. ఈ నెల 14న హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళనున్న ఆయన, అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
14వ తేదీన కౌలాలంపూర్ చేరుకున్న వెంటనే అక్కడ భారతీయ సంతతి ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమానికి ప్రధానంగా వివిధ రంగాలకు చెందిన భారతీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
15వ తేదీన మలేషియాలో తెలుగు అకాడమీని సందర్శించనున్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా వారు ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ప్రసంగిస్తారు.16వ తేదీన సింగపూర్ చేరుకోనున్న ఆయన, అదే రోజు సాయంత్రం శ్రీ సాంస్కృతిక కళాసారధి, సింగపూర్ వారి ద్వితీయ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం 17వ తేదీ ఉదయం సింగపూర్ లో ఉన్న గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఈ కార్యక్రమాలన్నింటినీ ముగించుకుని అక్టోబర్19వ తేదీని ముప్పవరపు వెంకయ్యనాయుడు తిరిగి భారత్ చేరుకుంటారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







