ఎంత బంగారాన్ని ఇండియాకు తీసుకెళ్లవచ్చంటే?

- October 13, 2022 , by Maagulf
ఎంత బంగారాన్ని ఇండియాకు తీసుకెళ్లవచ్చంటే?

దుబాయ్: యూఏఈలో దీపావళి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.ముఖ్యంగా పండుగ వేళల్లో దుబాయ్ లో బంగారు ఆభరణాల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి.దీపావళి వేడుకలకు ఇండియాకు వెళ్లే వారు తమ కుటుంబాల కోసం బంగారు ఆబరణాలను కొనేందుకు ఆసక్తి చూపుతారని దుబాయ్ బంగారం వాణిజ్యంలో 35 శాతం వాటా కలిగిన దుబాయ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.‘‘బంగారం, ఆభరణాలను కొనుగోలు చేసేందుకు దుబాయ్ ఉత్తమ ప్రదేశం.. ఎందుకంటే ఇది ఉత్తమ ధరను అందిస్తుంది.భారతదేశంలోని ఏ ప్రాంతంలో ధరించే ఆభరణాలు అయినా దుబాయ్‌లో దొరుకుతాయి.’’ అని జీఈడీ మలబార్ గ్రూప్ వైస్ చైర్మన్ అబ్దుల్ సలామ్ కేపీ తెలిపారు.దుబాయ్‌లో బంగారు ఆభరణాల ధరలు దాదాపు 12 నుండి 15 శాతం వరకు తక్కువగా ఉంటాయన్నారు.

ఇండియాకు ఎంత బంగారం తీసుకెళ్లవచ్చంటే..
దుబాయ్ లో బంగారం ధరలు తక్కువని ఎంతైనా కొని ఇండియాకు తీసుకెళ్లే అవకాశం లేదని టాక్స్ నిపుణులు చెబుతున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చే భారతీయ ప్రయాణీకుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు & కస్టమ్స్ (CBIC) కొన్ని పరిమితులను నిర్దేశించిందని యూఏఈలోని AskPankaj పన్ను సలహాదారుల మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ఎస్ జైన్ తెలిపారు. ఒక సంవత్సరానికి పైగా విదేశాలలో నివసిస్తున్న మగ ప్రయాణీకులు 20 గ్రాముల బంగారు ఆభరణాలను Dh2,500 (రూ.50,000) విలువైనవి, అదే మహిళలైతే 40 గ్రాముల బంగానే ఆభరణాలు Dh 5,000 (రూ.100,000) విలువ కలిగిన బంగారాన్ని ఎలాంటి టాక్స్ చెల్లించకుండానే తమవెంట ఇండియాకు తీసుకెళ్లవచ్చు.

బంగారం ‘డ్యూటీ ఫ్రీ’ కిందకు రాదా?
డ్యూటీ-ఫ్రీ అలవెన్స్ కింద బంగారు ఆభరణాల దిగుమతిని అనుమతించరని భారతదేశానికి చెందిన ఆర్ఎస్ఏ లీగల్ సొల్యూషన్స్ మేనేజింగ్ పార్టనర్ సుభాష్ చంద్ జైన్ తెలిపారు. 'డ్యూటీ-ఫ్రీ అలవెన్స్‌లో ' కింద వ్యక్తిగత ఉపయోగిత వస్తువులు వస్తాయి. సాధారణంగా బంగారు ఆభరణాలు కూడా డ్యూపీ ఫ్రీ కిందకు వస్తుందని అందరూ భావిస్తారని చెప్పారు. కానీ భారతీయ పన్ను అధికారులు మాత్రం 'ఉపయోగించిన వ్యక్తిగత వస్తువుల' జాబితాలో బంగారు ఆభరణాలు ఉండవని చెబుతున్నారు. అయితే, బంగారం (ఆభరణాలతో సహా) దిగుమతిని కొన్ని పరిమిత సందర్భాలలో మాత్రమే అనుమతించబడుతుందని, భారతీయ సంతతికి చెందిన ఎవరైనా లేదా భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్, కనీసం ఆరు నెలల విదేశాల్లో ఉన్నట్లయితే  భారతదేశానికి వచ్చే సమయంలో వారు గరిష్టంగా ఒక కిలోగ్రాము బంగారాన్ని దిగుమతి చేసుకోవచ్చు. అయితే, బంగారంపై (ఆభరణాలతో సహా) కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో బంగారం దిగుమతులపై అన్ని పన్నులు కలుపుకొని 18.45 శాతం వసూలు చేస్తున్నారని సుభాష్ చంద్ జైన్ వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com