మెడికల్ ఎమర్జెన్సీ కేసులను తరలించిన ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్

- October 13, 2022 , by Maagulf
మెడికల్ ఎమర్జెన్సీ కేసులను తరలించిన ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్

మస్కట్: దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్‌లో తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న పౌరులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించినట్లు రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ వెల్లడించింది. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ హెలికాప్టర్‌లో తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న పౌరుడిని అవసరమైన ప్రత్యేక చికిత్స కోసం దక్షిణ షర్కియా గవర్నరేట్‌లోని మసిరా హాస్పిటల్ నుండి అల్ దఖిలియా గవర్నరేట్‌లోని నిజ్వా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది.  మరొక ఘటనలో తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న పౌరుడిని దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్‌లోని మసీరా ఆసుపత్రి నుండి మస్కట్ గవర్నరేట్‌లోని రాయల్ ఆసుపత్రికి తరలించినట్లు వివరించింది. ఆరోగ్య రంగంలో ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ తన సామాజిక బాధ్యత కింద ఆరోగ్య సేవ (ఫ్లయింగ్ డాక్టర్) సేవలను అందిస్తున్నదని తెలిపారు.  ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహకారంతో పిల్లలకు టీకా ప్రచారం నిర్వహించడం, రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారిని సకారంలో ఆస్పత్రులకు తరలించడం, మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కీటకాలు, మిడుతలను ఎదుర్కోవడానికి స్ప్రేయింగ్ ప్రచారాలను కూడా నిర్వహిస్తున్నదని వైమానిక దళం ఒక ప్రకటనలో వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com