‘అన్‌స్టాపబుల్ 2’ స్ట్రీమింగ్‌కు టైమ్ ఖరారు..!
- October 13, 2022
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా మారి చేసిన తొలి టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ తొలి సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ టాక్ షోకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు రెండో సీజన్‌ను రెడీ చేశారు నిర్వాహకులు. ఇప్పటికే ‘అన్‌స్టాపబుల్ 2’కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఈ రెండో సీజన్ టాక్ షోకు సంబంధించిన స్ట్రీమింగ్ సమయాన్ని నిర్వాహకులు అనౌన్స్ చేశారు.
బాలయ్య రెట్టింపు ఎనర్జీతో వస్తున్న ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షోను అక్టోబర్ 14న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఇప్పటికే నిర్వాహకులు అనౌన్స్ చేయగా, తాజాగా ఈ షో ప్రీమియర్‌ను మధ్యాహ్నం 2.13 గంటలకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక రెండో సీజన్ తొలి ఎపిసోడ్‌కు ముఖ్య అతిథులుగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఆయన తనయుడు లోకేశ్ కలిసి వస్తున్నారు. అయితే ఈ టాక్ షోలో బాలయ్య చంద్రబాబును ఎలాంటి ప్రశ్నలు అడిగారా.. వాటికి బాబు ఎలాంటి సమాధానాలు ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక బాలయ్యను అన్‌స్టాపబుల్ టాక్ షోలో మరోసారి చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి రెండో సీజన్ తొలి ఎపిసోడ్‌కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..
- గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక
- చిన్నారుల మృతి ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్
- ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్
- ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న తెలంగాణ యువతి
- మలేషియా ప్రభుత్వం ప్రారంభించిన మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0
- కరీంనగర్ లో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచాలన్...
- శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్..