కృష్ణా నది పై ఐకానిక్ బ్రిడ్జికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
- October 14, 2022
ఏపీ: కృష్ణా నది పై ఐకానిక్ బ్రిడ్జికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల కృష్ణా నది ఫై రూ.1,082.56 కోట్లతో ఈ వంతెన నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ ట్విటర్ ద్వారా వెల్లడించారు.ఈ మేరకు ఐకానిక్ వంతెన ఫొటోలను ట్విట్టర్ లో పంచుకున్నారు. కాగా.. దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న కేబుల్, సస్పెన్షన్ ఐకానిక్ వంతెన ఇదే కావడం విశేషం. ఇది ప్రపంచంలో 2వ, దేశంలో తొలి చరిత్రాత్మక వంతెనగా నిలవనుందని పేర్కొన్నారు. వంతెనలో పాదచారుల మార్గం గాజుతో ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. వంతెనలో గోపురం ఆకారంలో పైలాన్, లైటింగ్ వ్యవస్థ ఉంటుందన్నారు. చుట్టూ నల్లమల అడవులు, ఎత్తయిన కొండలు, శ్రీశైలం రిజర్వాయర్ పరిసరాలతో ఈ వంతెన మంచి పర్యాటక ప్రాంతంగా మారనుంది. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని 30 నెలల్లోనే పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ వంతెన నిర్మాణంతో ఎట్టకేలకు 15 ఏళ్ల చిరకాల స్వప్నం సాకారం కానుంది.
తెలంగాణలోని కొల్లాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి రాకపోకలు సాగించాలంటే కృష్ణా నదిలో పడవ ప్రయాణం చేయాల్సిందే. ప్రమాదమని తెలిసినా ఏమీ చేయలని పరిస్థితి అక్కడి ప్రజలది. కానీ రోడ్డు మార్గంలో రావాలంటే వంద కిలోమీటర్లు ప్రయాణించాలి. 2007 లో కృష్ణా నదిలో పడవ మునగిన ఘటనలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి నదిపై బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం వేసింది.ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వైపు ప్రయాణించేవారికి కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు.హైదరాబాద్–తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.

తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







