మాజీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి..
- October 14, 2022
ముంబై: ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి అంటూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో నిర్దోషి అని తేల్చింది.బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ఈ తీర్పునిచ్చింది. సాయిబాబాను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. 2017లో ట్రయల్ కోర్టు సాయిబాబాకు జీవిత ఖైదు విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు 2017 మార్చిలో సాయిబాబా, ఇతర వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. శారీరక వైకల్యం కారణంగా వీల్చైర్లో ఉన్న సాయిబాబా ప్రస్తుతం నాగ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఉపా, ఐపీసీలోని వివిధ నిబంధనల ప్రకారం సాయిబాబా, ఇతరులను గతంలో కోర్టు దోషులుగా నిర్ధారించింది. అనంతరం ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్ను కూడా హైకోర్టు ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు. జీవిత ఖైదును సవాలు చేస్తూ ప్రొఫెసర్ సాయిబాబా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన నాగ్పూర్ బెంచ్.. సాయిబాబా నిర్దోషి అని తేల్చింది.
తాజా వార్తలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..
- కరూర్ ఘటనపై విజయ్ పై హైకోర్టు ఆగ్రహం
- ఏపీ: ఆటో డ్రైవర్ సేవలో..
- ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..