శేఖర్ కమ్ముల ఈ సారి రష్మికపై కన్నేశాడా.?

- October 14, 2022 , by Maagulf
శేఖర్ కమ్ముల ఈ సారి రష్మికపై కన్నేశాడా.?

శేఖర్ కమ్ముల పరిచయం చేసిన హీరోయిన్లు టాప్ రేంజ్‌లో వున్నారు. అలాగే, శేఖర్ కమ్ముల హీరోయిన్లంటే, ఓ ప్రత్యేకత వుంటుంది. హీరోయిన్ పాత్రలకు అత్యంత ప్రాధాన్యత వుంటుంది. టాలెంట్ వున్న నటీమణులయితే, శేఖర్ కమ్ముల సినిమాల ద్వారా ఆల్ టైమ్ గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకుల్లో మన్ననలు పొందొచ్చు.
అలాగే, ‘ఫిదా’ సినిమాతో సాయి పల్లవి ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. అంతకు ముందు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా శేఖర్ కమ్ముల కంపెనీ నుంచి దిగుమతి అయిన ముద్దుగుమ్మే.
అయితే, ఈ సారి శేఖర్ కమ్ముల సినిమాలో నేషనల్ క్రష్ రష్మికా మండన్నాకి ఛాన్స్ దక్కేలా వుంది. ఆల్రెడీ రష్మిక మండన్నా స్టార్ హీరోయిన్. నో డౌట్. అయితే, శేఖర్ కమ్ముల సినిమా ద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకోనుందని తెలుస్తోంది.
శేఖర్ కమ్ముల తొలి ప్యాన్ ఇండియా మూవీగా రూపొదబోతున్న సినిమాలో రష్మికను హీరోయిన్‌గా ఎంచుకునే యోచనలో వున్నట్లు తెలుస్తోంది. ధనుష్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న సినిమా కోసం రష్మికను హీరోయన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట. 
తెలుగులో ఆల్రెడీ స్టార్ హీరోయిన్, తమిళంలో రష్మిక తప్పడగులు మొదలయ్యాయ్. హిందీలో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంటూ రాకెట్ స్పీడుతో దూసుకెళుతోంది రష్మిక. అందుకే, తన సినిమాకి రష్మిక అయితే బాగుంటుందని శేఖర్ కమ్ముల భావిస్తున్నాడట. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com