బహ్రెయిన్ సర్ఫింగ్ లెజెండ్ ‘అల్ దోసరి’ మృతి
- October 16, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ సర్ఫింగ్ లెజెండ్, సర్ఫింగ్ శిక్షకుడు ముహన్నా అల్ దోసరి(33) సముద్ర ప్రమాదంలో మరణించారు. బహ్రెయిన్ సౌత్ కోస్ట్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బీచ్ కల్చర్ WLL వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ముహన్నా 2010లో పోర్ట్స్‌మౌత్ యూనివర్శిటీ నుండి ఎకనామిక్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్‌లో పట్టా పొందిన లెవెల్ 1 IKO సర్టిఫైడ్ కైట్‌సర్ఫింగ్ ట్రైనర్. 10 సంవత్సరాల వయస్సు నుండి బహ్రెయిన్ జాతీయ సెయిలింగ్ జట్టులో భాగమైన అతను బహ్రెయిన్ బీచ్ క్రీడలలో గుర్తింపు పొందారు. ఈ ప్రాంతంలో సముద్ర పర్యావరణ సుస్థిరతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన కృషి చేశారు. ముహన్నా బహ్రెయిన్ కైట్‌సర్ఫింగ్ అసోసియేషన్‌ను స్థాపించడంలో ఆయనది కీలక పాత్ర. అనేక సముద్ర/బీచ్ ఆధారిత కమ్యూనిటీ ఈవెంట్‌లను విజయవంతంగా నిర్వహించడంలో అల్ దోసరి కీలక భూమిక పోషించారు.
తాజా వార్తలు
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్‌గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం
- ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఫీజు రూపాయి మాత్రమే
- బాలకృష్ణ–చిరంజీవి వివాదం: 300 కేసుల యోచన రద్దు
- 'తెలుగు తల్లి’ ఫ్లైఓవర్ పేరు ఇకపై 'తెలంగాణ తల్లి'