కస్టమర్ల ఫిర్యాదులపై సీపీఏ కొరడా.. RO567,000 రికవరీ
- October 16, 2022
మస్కట్: 2022 జూలై-సెప్టెంబర్ కాలంలో కస్టమర్ల కోసం అర మిలియన్ రియాల్స్‌ను తిరిగి పొందినట్లు కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) వెల్లడించింది. 2022 మూడవ త్రైమాసికంలో రికవరీ చేయబడిన మొత్తం RO567,132 అని CPA జారీ తెలిపింది. వ్యాపారులపై వినియోగదారులు సమర్పించిన ఫిర్యాదులను పరిష్కరించి, రికవరీలు చేసినట్లు అథారిటీ పేర్కొంది. ఆటోమొబైల్స్ , ఆటో సర్వీసులు, బిల్డింగ్ మెటీరియల్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఫర్నిషింగ్‌లు, ఫర్నీచర్ వర్క్‌షాప్‌లతో సహా అధికార పరిధిలోకి వచ్చే అనేక రంగాలలో 8,215 ఫిర్యాదులు, 2,023 ఉల్లంఘనల నివేదికలు అందాయని అథారిటీ వెల్లడించింది. దుకాణాలు, వాణిజ్య కేంద్రాలను తనిఖీ చేయడానికి ఫీల్డ్ వర్క్ టీమ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు సుల్తానేట్‌లోని అన్ని మార్కెట్లలో అధిక ధరలను అరికట్టేందుకు అధికార యంత్రాంగం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని CPA అధికారి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!







