ఆ 18 మంది పిల్లల మరణానికి హౌతీలే బాధ్యులు
- October 16, 2022
యెమెన్‌లోని సనాలో గడువు ముగిసిన కీమోథెరపీ ఇంజెక్షన్‌తో 18 మందికి పైగా చిన్నారుల మరణానికి ఇరాన్ మద్దతుగల హౌతీ మిలీషియా కారణమని యెమెన్ సమాచార మంత్రి మొఅమర్ అల్-ఎర్యానీ ఆరోపించారు. మిలీషియా ఆధీనంలో ఉన్న నగరంలోని ఒక ఆసుపత్రిలో లుకేమియాకు చికిత్స పొందుతున్న పిల్లలకు – కలుషితమైన, నెలల తరబడి హౌతీల గిడ్డంగులలో నిల్వ చేయబడిన కీమోథెరపీ ఇంజెక్షన్లను వినియోగించినట్లు మంత్రి వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇతర సంస్థలు యెమెన్‌కు విరాళంగా అందించిన కీమోథెరపీ ఇంజెక్షన్లను హౌతీలు ఆసుపత్రులకు పంపిణీ చేశారని అల్-ఎర్యానీ వెల్లడించారు. అయితే, హౌతీలు వాటిని ఆసుపత్రులకు పంపిణీ చేయడానికి ముందు చాలా కాలం పాటు నిల్వ చేశారన్నారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అల్-ఎర్యానీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థలు ఉచితంగా అందించే మందులను హౌతీ మిలీషియా అడ్డుకోని వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తుందని ఆరోపించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







