‘సలార్’ నుండి పృథ్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదల
- October 16, 2022
హైదరాబాద్: ప్రభాస్ నటిస్తున్న సలార్ నుండి పృథ్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రభాస్ పోస్టర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమా టీజర్‌ను దీపావళికి గాని, ప్రభాస్ బర్త్‌డేకు గాని రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఈ తరుణంలో ఈరోజు మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ పుట్టిన రోజు సందర్బంగా అయన తాలూకా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది మేకర్స్.
ఈ చిత్రంలో పృథ్విరాజ్ ‘వర్ధరాజ మన్నార్’గా నటించనున్నాడు. రీసెంట్‌గా విడుదలైన పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. పోస్టర్‌ను గమనిస్తే పృథ్విరాజ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితియార్థంలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







