హైదరాబాద్-సింగపూర్ మధ్య అతిపెద్ద విమాన సర్వీసు
- October 16, 2022
హైదరాబాద్: హైదరాబాద్-సింగపూర్ మధ్య ఎయిర్ బస్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు రాకపోకలు సాగించే ప్రయాణిలకు కోసం సింగపూర్ ఎయిర్‌లైన్స్ సరికొత్తగా ఏ 350 -900 అతిపెద్ద విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. విమాన సేవలు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎస్‌క్యూ 523 నెంబర్ గల విమానం ఈ నెల 30న రాత్రి 11:10 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు బయలుదేరుతుంది.
అతిపెద్ద బాడీ గల ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 303 సీట్లు ఉండనున్నాయి. వీటిలో ఎకానమీ క్లాస్‌లో 263, బిజినెస్ క్లాస్ 40 సీట్లు ఉంటాయి. ఇది 15 వేల కిలోల సరుకును మోసుకెళ్లగలదు. ప్రస్తుతానికి సింగపూర్ – హైదరాబాద్‌ల మధ్య బోయింగ్ 737 – 8 విమానాలను సంస్థ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ విమానం సీట్ల సామర్థ్యం ఎకానమీలో 144, బిజినెస్‌క్లాస్‌లో 10 సీట్లతో మొత్తంగా 154 సీట్లు మాత్రమే.
ఇది కేవలం 2,400 కిలోల సరుకును మాత్రమే మోసుకెళ్లగలదు. కొత్తగా ప్రారంభించే ఏ 350 -900 విమానం వారంలో గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఏ 350 ఎయిర్‌క్రాఫ్ట్ సేవలను హైదరాబాద్ నుంచి ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నామని సింగపూర్ ఎయిర్‌లైన్స్ జనరల్ మేనేజర్ సై యెన్ చెన్ తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







