75వేల మంది యువతకు ప్రధాని మోడీ 'దీపావళి కానుక'
- October 20, 2022
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా 75వేల మంది యువతకు దీపావళి కానుకను ఇవ్వనున్నారు.75 వేల మందికి వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు.దీపావళి రెండు రోజుల ముందు ఈ శనివారం(అక్టోబర్ 22) వారితో వర్చువల్గా సమావేశమై వివిధ అంశాలపై మాట్లాడనున్నారు. అదే రోజు వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. రక్షణ, రైల్వే, హోం, కార్మిక, తపాల, ఉపాధి, సీఐఎస్ఎఫ్, సీబీఐ, కస్టమ్స్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి పలువురు కేంద్రమంత్రులు ఈ వర్చువల్ మీటింగ్కు హాజరుకానున్నారు. ఒడిశా నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గుజరాత్ నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ, చండీఘడ్ నుంచి అనురాగ్ ఠాకూర్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్ సహా వారి వారి పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎంపీలు హాజరుకానున్నారు.దేశంలో నిరుద్యోగంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో.. వచ్చే 18 నెలల్లో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోడీ జూన్‌లో ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు
- ETCA ఆద్వర్యంలో ఘనంగా 15 వ మెగా బతుకమ్మ సంబరాలు
- నేడు హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమం ప్రారంభం
- తానా ఆధ్వర్యంలో 'ప్రతిభామూర్తులు' సభ విజయవంతం
- మైటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం