నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- September 29, 2025
యూఏఈ: విజిట్ వీసాలకు సంబంధించి యూఏఈ కొత్త నిర్ణయం తీసుకుంది. నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రవేశపెట్టింది. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంటర్ టైన్ మెంట్, ఈవెంట్లు, క్రూయిజ్ షిప్లు మరియు యాచ్లలో నిపుణుల సంబంధినవి ఉన్నాయి. అలాగే ఎంట్రీ వీసా నిబంధనలలో కొన్ని కీలక సవరణలు చేసినట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ (ICP) ప్రకటించింది.
AIలోని నిపుణుల కోసం సంబంధించి సింగిల్ లేదా మల్టీపుల్ ఎంట్రీ కల్పించారు. అయితే, ఈ రకమైన వీసాను స్పాన్సరింగ్ లేదా హోస్టింగ్ సంస్థ నుండి లేఖను సమర్పించడం ద్వారా జారీ చేస్తారు. ఎంటర్ టైన్ మెంట్ ప్రయోజనాల కోసం వచ్చే విదేశీయులకు ఎంటర్ టైన్ మెంట్ వీసాలను తాత్కాలికంగా మంజూరు చేస్తారు.
ఇక ఫెస్టివల్స్, ఎగ్జిబిషన్, సెమినార్. ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, విద్యా కార్యకలాపాలు వంటి కార్యక్రమాలకు హాజరు కావడానికి విదేశీయులకు తాత్కాలిక కాలం కోసం ఈవెంట్ వీసాలను మంజూరు చేయనున్నారు. అయితే, స్పాన్సర్/హోస్ట్ ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగానికి చెందిన వ్యక్తి అయి ఉండాలని నిర్దేశించారు.
టూరిజానికి సంబంధించి విదేశీయులకు తాత్కాలిక కాలానికి క్రూయిజ్ షిప్లు మరియు పర్యాటక ప్రయోజనాల కోసం మల్టీ ఎంట్రీ వీసాలను జారీ చేస్తారు. వీటిని లైసెన్స్ పొందిన స్పాన్సర్ కార్యకలాపాలకు మాత్రమే మంజూరు చేస్తారు.
వీటితోపాటు నిర్దిష్ట షరతులకు అనుగుణంగా ICP హ్యూమటేరియన్ రెసిడెన్సీని ఒక ఏడాదిపాటు మంజూరు చేస్తుంది. యుద్ధాలు, విపత్తులు లేదా అశాంతితో బాధపడుతున్న దేశాల సిటిజన్స్ కు ఎలాంటి గ్యారంటీర్, హోస్ట్ అవసరం లేకుండా వీసాలు మంజూరు చేస్తారు. ఇలా జారీ అయిన వీసాలను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ నివేదికల ఆధారంగా రెసిడెన్సీని పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ తరహా వీసాలు పొందిన వారు తమ బంధువులను లేదా వారి జీవిత భాగస్వాముల బంధువులను తీసుకువచ్చేందుకు విదేశీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
విదేశీ వితంతువు లేదా విడాకులు తీసుకున్న విదేశీయులకు సంబంధించి ఒక సంవత్సరం పాటు నివాస అనుమతిని జారీ చేస్తారు. అదే కాలానికి పునరుద్ధరణకు అవకాశం కల్పించారు. ఇక భర్త ఎమిరాటీ అయిన సందర్భంలో నివాస అనుమతిని విడాకుల తీసుకున్న తేదీ నుండి ఆరు నెలల్లోపు జారీ చేస్తారు. భర్త విదేశీయుడు అయినా ఇవే నిబంధనలు వర్తిస్తాయని ప్రకటించారు.
దీనితో పాటు,మూడవ డిగ్రీ వరకు స్నేహితుడు లేదా బంధువు కోసం విజిట్ వీసాను స్పాన్సర్ ఆదాయం ఆధారంగా వారి స్పాన్సర్షిప్ను అనుమతించనున్నారు. అయితే, స్పాన్సర్ చేయాలనుకునే నివాసితులు కనీస ఆదాయం నెలకు కనీసం 4 వేల దిర్హామ్స్ ఉండాలి. రెండవ లేదా మూడవ డిగ్రీ బంధువులను స్పాన్సర్ చేయడానికి, నెలవారీ జీతం నెలకు 8వేల దిర్హామ్స్, ఇక స్నేహితులను స్పాన్సర్ చేసే విషయంలో, ప్రవాసికి నెలకు 15వేల సాలరీ ఉండాలని నిర్దేశించారు.
ఇక యూఏఈలో బిజినెస్ చేయాలనుకునే విదేశీయులకు వారి ఆర్థిక సామర్థ్యంతోపాటు వీదేశాల్లో ఆయా సంస్థల బిజినెస్ రికార్డుల ఆధారంగా జారీ చేయనున్నారు. అలాగే ట్రక్ డ్రైవర్లకు సంబంధించిన వీసాల జారీలోనూ సవరణలుచేశారు. హోస్ట్ ఒక సరుకు రవాణా సంస్థ లేదా వస్తువుల రవాణాలో బిజినెస్ ఉంటే, నిర్దేశించిన రుసుములను చెల్లించి సింగిల్ ఎంట్రీ వీసాలను పొందవచ్చు. అయితే,డ్రైవర్ కు తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని కండిషన్ విధించారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







