అన్న హీరోయిన్‌తో తమ్ముడి లవ్ ఎఫైర్.! క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్.!

- October 20, 2022 , by Maagulf
అన్న హీరోయిన్‌తో తమ్ముడి లవ్ ఎఫైర్.! క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్.!

అల్లు వారింట లుకలుకలున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అల్లు శిరీష్ కొన్నాళ్లుగా ఈ లుకలుకల కారణంగానే ఇంటికి దూరంగా వుంటున్నాడనేది ఆ ప్రచారం తాలూకు సారాంశం.
అయితే, అలాంటిదేమీ లేదనీ, అల్లు ఫ్యామిలీ అంతా కలిసే వుందని రీసెంట్‌గా అల్లు వారింట జరిగిన డిన్నర్ పార్టీ నిరూపించింది. ఇదిలా వుంటే, అసలు గొడవలకు కారణమైన అల్లు శిరీష్ తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ ఎఫైర్ గురించి క్లారిటీ ఇచ్చాడు.
అల్లు శిరీష్‌కీ, అనూ ఇమ్మాన్యుయేల్‌కీ మధ్య ఏదో జరుగుతోందనీ, పీకల్లోతు లవ్‌లో వున్నారనీ, ఆ ఇష్యూతోనే ఇంట్లో గొడవలు జరిగాయని అందుకే, శిరీష్ ఇల్లు వదిలి బెంగుళూర్‌లో వుంటున్నాడనీ జరుగుతోన్న ప్రచారానికి తాజా ఇంటర్వ్యూలో చెక్ పెట్టేశాడు. 
అనూ తనకి మంచి ఫ్రెండ్ అనీ, వేవ్ లెంగ్త్ విషయంలో మా ఇద్దరికీ సెట్ అవుతుందనీ, అంతే తప్ప లవ్వూ, గివ్వూలాంటివేమీ మా మధ్య లేవని శిరీష్ తేల్చేశాడు. అంతేకాదు, అనూ ఇమ్మాన్యుయేల్ చాలా ప్రొఫిషనల్.. అందుకే రొమాంటిక్ సీన్లలో తనతో నటించడం చాలా తేలిక.. అని కూడా రివీల్ చేశాడు.
అనూ, శిరీష్ కలసి, ‘ప్రేయసివో రాక్షసివో’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా కోసం అల్లు అర్జున్‌తో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేసింది అనూ ఇమ్మాన్యుయేల్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com