కాజల్ అగర్వాల్ కొడుకు కాలేజీకి.! అప్పుడేనా.?
- October 20, 2022
ప్యాండమిక్ టైమ్‌ని వేస్ట్ చేయకుండా చందమామ కాజల్ అగర్వాల్ చక్కగా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా అస్సలు రాజీ పడలేదు. టైమ్ తీసుకోకుండానే ప్రెగ్నెంట్ అయ్యింది. ప్రెగ్నెంట్ అయ్యాకా, మాతృత్వపు మధుర క్షణాల్ని ప్రతీ క్షణం ఆస్వాదిస్తూనే వుంది కాజల్ అగర్వాల్.
ఆరు నెలల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆ పసికందుకు ‘నీల్’ అని నామకరణం చేసుకుంది కాజల్ అగర్వాల్. తల్లిగా తాను పొందిన అనుభవాన్నీ, మధురానుభూతుల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే వుంది కాజల్ అగర్వాల్.
తాజాగా కాజల్ మరోసారి తన ఇన్‌స్టా వేదికగా కొడుకు నీల్ గురించి అందంగా ప్రస్థావించింది. అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయా.? తనతో వుంటే, టైమ్ ఎంత ఫాస్ట్‌గా గడిచిపోయిందో కదా.. అని కాజల్ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఆనంద సమయంలోనే వచ్చే వారం నీల్ని కాలేజీకి పంపించేయొచ్చు.. అంటూ సరదాగా కాజల్ భర్త కిచ్లూ కాజల్‌తో అన్నాడట. ఆ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా రాసుకొచ్చి కాజల్ తెగ మురిసిపోతోంది.
కొడుకు కన్నా, తనకు ఏదీ ముఖ్యం కాదనీ, తన కోసం ఎంతటి సవాళ్లనైనా ఎదిరిస్తానని చెబుతూ, నీల్ని తమ ప్రేమ కానుకగా కాజల్ అభివర్ణించింది. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
తాజా వార్తలు
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్‌వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!