మాస్ రాజా రవితేజ ‘ధమాకా’ మాస్ క్రాకర్.!
- October 21, 2022
మాస్ రాజా రవితేజ తాజా చిత్రం ‘ధమాకా’ నుంచి దీపావళి సందర్భంగా టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కరెక్ట్‌గా చెప్పాలంటే, దీపావళికి రావల్సిన అసలు సిసలు క్రాకర్లాగే వుంది ఈ టీజర్. అందుకే ధమాకా మాస్ క్రాకర్ పేరుతో ఈ టీజర్ రిలీజ్ చేశారు.
‘నేను నీలో విలన్ని చూస్తే, నువ్వు నాలో హీరోని చూస్తావు.. కానీ, యాక్షన్‌లోకి దిగితే, నేనో శాడిస్ట్’ని అంటూ రవితేజ చెప్పే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. అట్నుంచి ఓ బుల్లెట్ వస్తే, ఇటు నుంచి దీపావళే..’ అనే డైలాగ్‌తో ఎండ్ అవుతుంది.
ఓ మాంచి మసాలా యాక్షన్‌తో రవితేజ మార్కు మాస్ డైలాగులతో టీజర్ కట్ చేశారు. కానీ, ఈ మధ్య రవితేజ నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిలవుతున్న సంగతి తెలిసిందే. దాంతో మాస్ రాజా కాస్తా మూస రాజా అయిపోయాడన్న విమర్శలు బాగా వినిపిస్తున్నాయ్.
మరి, ఆ డ్యామేజ్ నుంచి రవితేజ బయటపడాలంటే, ‘ధమాకా’ సూపర్ హిట్ అవ్వాల్సి వుంది. డైరెక్టర్ వైపు నుంచి ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయ్ కానీ, రవితేజ లక్కు ఎలా వుందో చెప్పలేం. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. సినిమా డిశంబర్‌లో రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్‌లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







