9 నెలల్లో SR9.4 బిలియన్ల క్రెడిట్‌లకు సౌదీ ఆమోదం

- October 21, 2022 , by Maagulf
9 నెలల్లో SR9.4 బిలియన్ల క్రెడిట్‌లకు సౌదీ ఆమోదం

రియాద్ : సౌదీ ఎగుమతి-దిగుమతి బ్యాంక్ (సౌదీ EXIM) 2022 ప్రారంభం నుండి సెప్టెంబర్‌లో మూడవ త్రైమాసికం చివరి వరకు SR9.4 బిలియన్ల విలువైన క్రెడిట్ సౌకర్యాలను ఆమోదించినట్లు వెల్లడించింది. ఇందులో ఎరువులు, పెట్రోకెమికల్స్, గాజు, ప్లాస్టిక్స్, ఇనుము, ఉక్కుతో సహా కీలక రంగాలలో ఎగుమతి కార్యకలాపాలకు మద్దతునిచ్చే SR3.5 బిలియన్ల విలువైన ఎగుమతి ఫైనాన్సింగ్ అభ్యర్థనలు ఉన్నాయన్నది. ఎగుమతి క్రెడిట్ బీమా కోసం అభ్యర్థనల వాటా సుమారు SR5.9 బిలియన్లు కూడా ఇందులో ఉన్నాయన్నారు. ఈ మేరకు సౌదీ ఎగ్జిమ్ బ్యాంక్ ఇటీవల మూడవ త్రైమాసిక పనితీరు బులెటిన్ నివేదికను విడుదల చేసింది. సెప్టెంబర్ చివరి వరకు 37 క్రెడిట్ అప్లికేషన్‌లను ఆమోదించినట్లు అందులో పేర్కొన్నారు. వీటిలో 24 ఫైనాన్సింగ్, 13 ఎగుమతి క్రెడిట్ బీమా కోసం దాఖలు చేసిన దరఖాస్తులు ఉన్నాయి. ఈ క్రెడిట్‌లు యూఎస్, యూకే, చైనా, స్వీడన్, ఇండియా, ఫ్రాన్స్, పాకిస్తాన్‌లతో పాటు అనేక ఆసియా, ఆఫ్రికన్, యూరోపియన్, దక్షిణ అమెరికా దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా 60 కంటే ఎక్కువ దేశాలలో అంతర్జాతీయ మార్కెట్‌లకు ఎగుమతి ఒప్పందాలకు సంబంధించినవని సౌదీ ఎగ్జిమ్ బ్యాంక్ తెలిపింది. జాతీయ ఉత్పత్తుల ఎగుమతిని అభివృద్ధి చేయడానికి, చమురుయేతర వస్తువులు, సేవలకు ఎగుమతి అవకాశాలను పెంచడానికి, అలాగే ప్రాంతీయ, ప్రపంచ మార్కెట్లలో వారి పోటీతత్వాన్ని పెంచడానికి, వాణిజ్యాన్ని పెంపొందించడానికి మరింత ఫైనాన్సింగ్, బీమా పరిష్కారాలను అందించడానికి బ్యాంక్ ప్రయత్నాలలో భాగంగా ఈ క్రెడిట్‌ల అప్లికేషన్లు వచ్చాయని సౌదీ ఎగ్జిమ్ బ్యాంక్ ప్రకటించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com