రాజమౌళికి బిస్కెట్ వేసిన సంజయ్ దత్.! మనసులోని కోరిక బయటపెట్టేశాడుగా.!

- October 21, 2022 , by Maagulf
రాజమౌళికి బిస్కెట్ వేసిన సంజయ్ దత్.! మనసులోని కోరిక బయటపెట్టేశాడుగా.!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన డైరెక్టర్ రాజమౌళి. ఆయన సినిమాలో చిన్న పాత్రలోనైనా కనిపించాలని ఆయా భాషల నుంచి పలువురు నటీనటులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, రాజమౌళి అంటే తనకు ఎంతో ఇష్టమనీ ఆయనపై విపరీతమైన అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే, సౌత్ సినిమాల్లో నటించాలని వుందన్న తన కోరికను బయట పెట్టారు.
ఆల్రెడీ కన్నడ సినిమా ‘కేజీఎఫ్’లో ‘అధీర’ పాత్రలో సంజయ్ దత్ నటించిన సంగతి తెలిసిందే. మరిన్ని సౌత్ సినిమాల్లో నటించాలనుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజయ్ దత్ చెప్పారు. 
కన్నడ హీరో ధృవ్ సర్జా నటించిన ‘కేడీ - ది డెవిల్’ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. కన్నడతో పాటూ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘కేడీ’ టీజర్ హిందీ వెర్షన్ రిలీజ్ చేశారు.
ఈ టీజర్‌కి సంజయ్ దత్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. త్వరలోనే ధృవ్ సర్జాతో కలిసి నటించాలని ఎదురు చూస్తున్నా.. అని ఈ సందర్భంగా సంజయ్ దత్ చెప్పారు. ఆ మాటల్లోనే సౌత్ సినిమాపైనా ప్రేమను చాటుకున్నారు. సో, తెలుగులోనూ సంజయ్ దత్ త్వరలోనే కనిపించే అవకాశాల్లేకపోలేదు మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com