దీపావళికి ముందే ఢిల్లీలో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ
- October 22, 2022
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం క్రమంగా మళ్లీ పెరుగుతోంది. దీపావళి కన్నా ముందే ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని అధికారులు తెలిపారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 262కు చేరిందన్నారు. ఇవాళ AQI 300 మార్క్ దాటే అవకాశం ఉందని ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కమిషన్ అంచనా వేస్తోంది. ఈరోజు ఉదయం ఢిల్లిలోని ఇండియా గేట్ సమీపంలో పొగ మంచు కమ్మేసింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ ఆదేశాలను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పొల్యూషన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం దీపావళికి పటాకులు కాల్చడంపై నిషేధం విధించింది. పటాకులు తయారుచేసినా, అమ్మినా రూ. 200 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించనున్నట్లు ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. జరిమానాతో పాటు 6 నెలలు జైలు శిక్ష విధించనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







