కేటీఆర్ సమక్షంలో ‘టీఆర్ఎస్’లో చేరిన డాక్టర్ రవికుమార్ పనస

- October 22, 2022 , by Maagulf
కేటీఆర్ సమక్షంలో ‘టీఆర్ఎస్’లో చేరిన డాక్టర్ రవికుమార్ పనస

హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో డాక్టర్ రవికుమార్ పనస తెలంగాణ/భారత రాష్ట్ర సమితి (T/BRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ కుండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. సరైన సమయంలో సరైనా నిర్ణయం తీసుకున్నారని.. రాష్ట్రంలో గొప్ప విప్లవాత్మక మార్పు ప్రారంభమైందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్ ఆచరణలు, ఆదర్శ దార్శనిక ఆలోచనలతో మార్పు ప్రారంభమైందని కేటీఆర్ అన్నారు.

ఈ సందర్భంగా రవి పనస మాట్లాడుతూ.. కేటీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కేటీఆర్ భాషా నైపుణ్యం, నాయకత్వం, చేసే పనిలో స్పష్టతపై ప్రశంసలు కురిపించారు. అధికారికంగా గులాబీ దళంలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.

రవి కుమార్ పనస ఫిల్మ్ మ్యాగజైన్ ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి.. PRO, ఈవెంట్ ఆర్గనైజర్‌, లిక్కర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ రంగంలో విశేషంగా రాణిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 500 ఎకరాలకు పైగా వెంచర్లను రవికుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఇటీవలే సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించి స్వంత బ్యానర్‌ను ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com