వారంలో 3,000 మంది నిర్వాసితుల డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్
- October 23, 2022
కువైట్: నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా గత వారంలో సుమారు 3,000 ప్రవాస డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వెల్లడించింది. ప్రవాస డ్రైవర్ల లైసెన్స్ ఫైళ్లను మళ్లీ తెరవాలని మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్ ఖలీద్ ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టరేట్ ప్రకటించింది. ఉపసంహరించిన లైసెన్స్‌లలో వర్క్ పర్మిట్‌లో మార్పు, నివాస మార్పు జరిగినవి అధికంగా ఉన్నాయన్నారు. అన్ని లైసెన్స్‌లను సమీక్షించడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని, షరతులు పాటించకపోతే లైసెన్స్‌లు బ్లాక్ చేయనున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వెల్లడించింది. వ్యక్తి లైసెన్స్‌ను అందజేయకపోతే కువైట్ మొబైల్ ఐడి, సాహెల్ అప్లికేషన్ ద్వారా బ్లాక్ చేయబడుతుందని తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినా వాహనం నడుపుతున్నట్లు గుర్తిస్తే, చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని, చట్టాలను పాటించనందుకు కువైట్ నుండి బహిష్కరించే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







