ఏపీ సీఎం జగన్ తో వర్మ భేటీ..
- October 26, 2022
ఏపీ సీఎం జగన్ తో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో రాంగోపాల్ వర్మ సమావేశమయ్యారు. వీరిద్దరు పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.సుమారు 45 నిమిషాలపాటు వీరిద్దరి సమావేశం కొనసాగింది. అనంతరం జగన్ నివాసం నుంచి వర్మ బయటకు వచ్చారు.వీరిద్దరి భేటీ అటు రాజకీయంగాను..ఇటు సిని పరిశ్రమలోను ఆసక్తికరంగా మారింది.వీరిద్దరు ఎందుకు సమావేశమయ్యారు? ఏఏ అంశాలపై మాట్లాడుకున్నారు. అనే విషయం ఉత్కంఠగా మారింది.
కాగా ఏపీలో మూడు రాజధానుల అంశం హీట్ పుట్టిస్తోంది. ఈక్రమంలో వీరిద్దరి సమావేశం కావటం విశేషంగా మారింది. సంచలన సినిమాలు తీస్తు..వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో ఉండేవర్మ సీఎం జగన్ తో భేటీ కావటం ఆసక్తి కలిగిస్తోంది. ఏపీలో జరుగుతున్న పలు కీలక అంశాలపై వర్మ సినిమా తీస్తారా? అనే విషయంపై ఉత్కంఠ కలిగిస్తోంది.
కాగా..గత ఎన్నికలకు ముందు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీశారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా..వైసీపీకి రాజకీయంగా అంతో ఇంతో కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వచ్చాయి అప్పట్లో. ఈక్రమంలో వచ్చే ఎన్నికలల్లో తమ పార్టీకి లబ్ది చేకూరేలా జగన్ ప్లాన్ చేస్తున్నారా? టీడీపీపైనా ..జనసేనపైన బురద చల్లే యోచనలో వర్మతో సినిమా తీయించనున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి వీరిద్దరి భేటీ కావటం. ఎన్నికలకు ముందు రాంగోపాల్ వర్మతో జగన్ భేటీ చాలా కీలకమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా జగన్ ఎవ్వరికి ఆఖరికి తన ఎమ్మెల్యేలకు..మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వరని అంటుంటారు. అటువంటిది వర్మతో సమావేశం అత్యంత కీలకమని మాత్రం తెలుస్తోంది.
తాజా వార్తలు
- అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!







