మహేష్‌బాబుకీ, ‘కేజీఎఫ్‌కీ లింకు పెట్టేస్తారా.?
- October 26, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది.
సెకండ్ షెడ్యూల్ కోసం టీమ్ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ లోపు ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తాజాగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో విలన్ రోల్ కోసం ఓ బాలీవుడ్ సీనియర్ హీరోతో సంప్రదింపులు జరుగుతున్నాయంటూ గాచిప్ గుసగుసలాడుతోంది.
ఆయన మరెవరో కాదు, బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్. ఆల్రెడీ ఈయన ‘కేజీఎఫ్’ సినిమాతో సౌత్ సినిమాల్ని టచ్ చేశాడు. అంతేకాదు, మరిన్ని సౌత్ సినిమాల్లో మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో నటించాలని వుందంటూ తన మనసులోని మాటను ఇటీవలే బయట పెట్టిన సంగతి తెలిసిందే.
సో, ఆయన కోరిక ఇంత త్వరగానే తీరపోతుందా.? అంటే, అవుననే అనాలేమో. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ కోసం సంజయ్ దత్‌నే విలన్‌గా ఎంచుకోవాలనుకుంటున్నారనీ తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే, ఇప్పటికే ఈ సినిమాపై వున్న అంచనాలు.. మరింత రెట్టింపయ్యే అవకాశాలున్నాయ్. బుట్టబొమ్మ పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్‌డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







