‘కాంతారా’ మేనియా తగ్గేదే లే.! ప్రధాని మోదీ వరకూ వెళ్లిన ‘కాంతారా’ మూవీ ముచ్చట.!

- October 26, 2022 , by Maagulf
‘కాంతారా’ మేనియా తగ్గేదే లే.! ప్రధాని మోదీ వరకూ వెళ్లిన ‘కాంతారా’ మూవీ ముచ్చట.!

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ మూవీ ‘కాంతారా’ మేనియా ఇప్పట్లో తగ్గేదే లే.! అంటోంది. ఇప్పటికే రిలీజై మూడు వారాలు దాటుతోంది ఈ సినిమా. 
అయినా ఇంకా వసూళ్లు నిలకడగా కొనసాగుతుండడం విశేషం. స్ట్రెయిట్ మూవీస్ కూడా భళాదూర్ అంటున్నాయ్ ఈ సినిమా ముందు. అంతకు ముందే కన్నడలో రిలీజై 100 కోట్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టించిన ఈ సినిమా తెలుగుతో పాటూ, ఇతర భాషల్లోనూ రిలీజ్ చేశారు.
టాలీవుడ్ బాక్సాఫీస్‌కి వసూళ్ల పంట పండిస్తోందీ సినిమా. అలాగే విడుదలైన అన్ని భాషల్లోనూ వసూళ్లు పరుగులు పెట్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 230 కోట్ల వరకూ వసూళ్లు సాధించిందనీ ట్రేడ్ పండితుల అంచనా. ఈ నేపథ్యంలో ‘కాంతారా’ సినిమాని ప్రధాని మోదీ వీక్షించాలనుకుంటున్నట్లు తాజాగా అందుతోన్న సమాచారం.
నవంబర్ 14న ప్రధాని మోదీ, హీరో రిషబ్ శెట్టితో కలిసి ‘కాంతారా’ మూవీని వీక్షించాలనుకుంటున్నారనీ తెలుస్తోంది. నిజమే అయితే, ‘కాంతారా’ రికార్డుల్లో మరో కొత్త రికార్డు చేరినట్లే. 
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కాంతారా’. కర్ణాటక సాంప్రదాయాల్ని కళ్లకు కట్టినట్లుగా చూపించిన ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అమితంగా ఆకట్టుకుంటోంది. అదే కదా, కంటెంట్‌కున్న గొప్పతనం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com