ఫోన్ లో మాట్లాడటం మాని...ఆ పై రోడ్డు దాటు

- April 20, 2016 , by Maagulf
ఫోన్ లో మాట్లాడటం మాని...ఆ పై  రోడ్డు దాటు

 ' సురక్షితంగా రోడ్ దాటటానికి ఫోన్ ని విడిచిపెట్టు '  అజమాన్  పోలీస్ ఒక ప్రచారం మొదలుపెట్టారు. సమాచారం మరియు ప్రజా సంబంధాల శాఖ సహకారంతో  ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ప్రారంభించారు.లెఫ్టినెంట్ కల్నల్  డైరెక్టర్, ట్రాఫిక్ , పెట్రోలింగ్  శాఖ , అజమాన్  పోలీస్  ఆలీ హుమిడ్  అల్ ముసైబి మాట్లాడుతూ, తరలింపు ప్రమాదాలను నివారించడానికి రోడ్డు దాటే సమయంలో పాదచారులకు పూర్తిగా రోడ్లపై దృష్టి నిర్ధారించే లక్ష్యంతో ఉండాలని చెప్పారు.అలాగే "గత ఏడాది , రోడ్లు దాటే సమయంలో పరుగులు పెడ్తూ ప్రమాదాలు గురైనవారు 102 మందని  ఈ బాధితులలో అనేకమంది  మొబైల్ ఫోన్లను ఆ సమయంలో  వాడుతున్నట్లు తేలిందన్నారు." రహదారులు దాటే వేళలో వారికి ఏకాగ్రత లేకపోవడం ఒక ముఖ్య కారణం." పాదచారులు ప్రమాదాలను నివారించడానికి, తప్పక ట్రాఫిక్ నియమాలు గౌరవించాలని  కేవలం వాహనదారులు పాటిస్తే సరిపోదని " అన్నారాయన. ప్రచారంలో భాగంగా ఈ  ప్రకటనలను  పాఠశాలలు మరియు విద్యాలయాల్లో పంపిణీ చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com