ఫోన్ లో మాట్లాడటం మాని...ఆ పై రోడ్డు దాటు
- April 20, 2016
' సురక్షితంగా రోడ్ దాటటానికి ఫోన్ ని విడిచిపెట్టు ' అజమాన్ పోలీస్ ఒక ప్రచారం మొదలుపెట్టారు. సమాచారం మరియు ప్రజా సంబంధాల శాఖ సహకారంతో ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ప్రారంభించారు.లెఫ్టినెంట్ కల్నల్ డైరెక్టర్, ట్రాఫిక్ , పెట్రోలింగ్ శాఖ , అజమాన్ పోలీస్ ఆలీ హుమిడ్ అల్ ముసైబి మాట్లాడుతూ, తరలింపు ప్రమాదాలను నివారించడానికి రోడ్డు దాటే సమయంలో పాదచారులకు పూర్తిగా రోడ్లపై దృష్టి నిర్ధారించే లక్ష్యంతో ఉండాలని చెప్పారు.అలాగే "గత ఏడాది , రోడ్లు దాటే సమయంలో పరుగులు పెడ్తూ ప్రమాదాలు గురైనవారు 102 మందని ఈ బాధితులలో అనేకమంది మొబైల్ ఫోన్లను ఆ సమయంలో వాడుతున్నట్లు తేలిందన్నారు." రహదారులు దాటే వేళలో వారికి ఏకాగ్రత లేకపోవడం ఒక ముఖ్య కారణం." పాదచారులు ప్రమాదాలను నివారించడానికి, తప్పక ట్రాఫిక్ నియమాలు గౌరవించాలని కేవలం వాహనదారులు పాటిస్తే సరిపోదని " అన్నారాయన. ప్రచారంలో భాగంగా ఈ ప్రకటనలను పాఠశాలలు మరియు విద్యాలయాల్లో పంపిణీ చేస్తారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







