వీసా లేకుండానే ఒమన్‌లోకి ప్రవేశం
- October 27, 2022
ఒమన్: జిసిసి దేశాల నివాసితులందరికీ అన్ని వాణిజ్య వృత్తుల కోసం ఒమన్ సుల్తానేట్‌లోకి ప్రవేశించే హక్కు ఉందని ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ సర్క్యులర్‌లో పేర్కొంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో (GCC) నివాసితుల వీసాకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ నుండి ఒమన్ విమానాశ్రయాలకు అందిన ఆదేశాల ఆధారంగా ఈ సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపింది. జీసీసీ దేశాలలోని నివాసితులందరికీ అన్ని వాణిజ్య వృత్తుల కోసం సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోకి ప్రవేశించే హక్కు ఉంటుంది. ప్రజలు నివసించే దేశం నుండి రావాల్సిన అవసరం లేదు. ఈ సదుపాయాన్ని పొందేందుకు ఏ సమయంలోనైనా వారు ఏ గమ్యస్థానం నుండి వచ్చినా ఒమన్ లోకి అనుమతించనున్నట్లు ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ తెలిపింది. అయితే, నివాస వీసా మూడు నెలల కంటే తక్కువ వ్యవధిలో GCCలో చెల్లుబాటులో ఉండాలి.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







