కువైట్‌లో బాలీవుడ్ గాయకుడు టోనీ కక్కర్ ప్రదర్శన

- October 27, 2022 , by Maagulf
కువైట్‌లో బాలీవుడ్ గాయకుడు టోనీ కక్కర్ ప్రదర్శన

కువైట్: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, రాపర్ టోనీ కక్కర్ కువైట్‌లో నవంబర్ 10వ తేదీన అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ మైదాన్ హవల్లీలో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనున్నారు. సాజ్ (SAAZ) ఈవెంట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. క్రింగ్ పాప్ పాటలకు ప్రసిద్ధి టోనీకక్కర్ మొదటిసారిగా కువైట్‌లో ప్రదర్శన ఇస్తున్నారు. టోనీ కక్కర్‌ను సంగీత స్వరకర్తగా 'ఏక్ పహేలీ లీలా' చిత్రంలోని "ఏక్ దో తీన్ చార్", "ఖుదా భీ" వంటి అనేక ప్రసిద్ధ పాటలను పాడారు. అలాగే 'ఫీవర్;' చిత్రం నుండి "మైలే హో తుమ్," "ఖరా ఖరా".. ఇల్-లేట్ స్టోరీ 4 నుంచి "దిల్ అష్కోన్ మే" "మొహబ్బత్ నషా హై ఎల్'.. "కోకా కోలా తు", "ధీమే ధీమే", "మైలే హో తుమ్", "కార్ మే మ్యూజిక్ బాజా", "కుచ్ కుచ్" వంటి అనేక ప్రసిద్ధ పాటలను టోనీ పాడారు. ఆసక్తి ఉన్నవారు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో https://www.eventat.com/tony-kakkarలో బుక్ చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com