ఇండియన్ ఎంబసీలో ఘనంగా ‘గోవా స్టేట్ ఫెసిలిటేషన్ ఈవెంట్‌’

- October 27, 2022 , by Maagulf
ఇండియన్ ఎంబసీలో ఘనంగా ‘గోవా స్టేట్ ఫెసిలిటేషన్ ఈవెంట్‌’

కువైట్: భారత రాయబార కార్యాలయం అక్టోబర్ 26న టూరిజం, పెట్టుబడి అవకాశాలపై దృష్టి సారిస్తూ స్టేట్ ఫెసిలిటేషన్ ఈవెంట్ - గోవాను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కువైట్‌లోని భారత రాయబారి HE సిబి జార్జ్ తరపున ప్రథమ కార్యదర్శి (వాణిజ్యం) డాక్టర్ వినోద్ గైక్వాడ్ హాజరై ప్రతి ఒక్కరికీ స్వాగతం పలికారు. భారతదేశంలోని గోవా అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రమన్నారు. గోవా అందమైన బీచ్‌లు, అద్భుతమైన నైట్ స్టే, రుచికరమైన ఆహారం, థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్, ఫుట్‌బాల్‌తో ప్రపంచ స్థాయి ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉందన్నారు. గోవా సంప్రదాయం, ఆధునికత సమ్మేళనాన్ని కలిగి ఉందన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి భారతదేశాన్ని సందర్శించే పర్యాటకులకు గోవా స్వర్గధామం అన్నారు. గోవా ప్రజల ఆతిథ్యాన్ని ఆస్వాదించడానికి.. ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు  అందమైన గోవాను సందర్శించాలని కువైటీలను వినోద్ గైక్వాడ్ కోరారు. ఈ కార్యక్రమంలో గోవా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, గోవా ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ ప్రతినిధుల పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో గోవా రాష్ట్రంలోని పర్యాటక రంగానికి సంబంధించిన అనేక ప్రాంతాలను తెలిపే వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన గోవా సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com