ఇండియన్ ఎంబసీలో ఘనంగా ‘గోవా స్టేట్ ఫెసిలిటేషన్ ఈవెంట్’
- October 27, 2022
కువైట్: భారత రాయబార కార్యాలయం అక్టోబర్ 26న టూరిజం, పెట్టుబడి అవకాశాలపై దృష్టి సారిస్తూ స్టేట్ ఫెసిలిటేషన్ ఈవెంట్ - గోవాను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కువైట్‌లోని భారత రాయబారి HE సిబి జార్జ్ తరపున ప్రథమ కార్యదర్శి (వాణిజ్యం) డాక్టర్ వినోద్ గైక్వాడ్ హాజరై ప్రతి ఒక్కరికీ స్వాగతం పలికారు. భారతదేశంలోని గోవా అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రమన్నారు. గోవా అందమైన బీచ్‌లు, అద్భుతమైన నైట్ స్టే, రుచికరమైన ఆహారం, థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్, ఫుట్‌బాల్‌తో ప్రపంచ స్థాయి ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉందన్నారు. గోవా సంప్రదాయం, ఆధునికత సమ్మేళనాన్ని కలిగి ఉందన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి భారతదేశాన్ని సందర్శించే పర్యాటకులకు గోవా స్వర్గధామం అన్నారు. గోవా ప్రజల ఆతిథ్యాన్ని ఆస్వాదించడానికి.. ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు అందమైన గోవాను సందర్శించాలని కువైటీలను వినోద్ గైక్వాడ్ కోరారు. ఈ కార్యక్రమంలో గోవా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, గోవా ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ ప్రతినిధుల పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో గోవా రాష్ట్రంలోని పర్యాటక రంగానికి సంబంధించిన అనేక ప్రాంతాలను తెలిపే వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన గోవా సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







