రామ్ కోసం స్పెషల్ ఐటెమ్ సెట్ చేసిన బోయపాటి.!
- October 27, 2022
మాస్ డైరెక్టర్ బోయపాటి శీను డైరెక్షన్లో రామ్ పోతినేని ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదికెళ్లింది. రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది.
బోయపాటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ అంటే చాలా చాలా స్పెషల్‌గా వుంటాయ్. పక్కా మాస్ స్టెప్పులతో మాస్ జనాల్ని విశేషంగా ఆకట్టుకుంటాయ్. రామ్ లాంటి డాన్సింగ్ స్టార్ వుంటే, ఇంకేముంది ఆ ఐటెం సాంగ్ రచ్చ రచ్చే.
అందుకే ఈ సినిమాలోని ఐటెం సాంగ్ కోసం, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాని తీసుకొస్తున్నారట. ఈ సాంగ్ కోసం ఊర్వశి రౌతెలాకి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట.
ఊర్వశి మంచి డాన్సర్. అలాంటి ఊర్వశికి, రామ్‌లాంటి డాన్సింగ్ పార్ట్నర్ దొరికితే ఎలా వుంటుంది. ఈ పాట సూపర్ హిట్టే మరి. ఇదిలా వుంటే, గతంలో ‘బ్లాక్ రోజ్’ సినిమాలో నటించింది ఊర్వశి రౌతెలా. అయితే, ఆ సినిమా ఒక్క సాంగ్ ప్రోమోకి మాత్రమే పరిమితమైంది. సినిమా ఇంతవరకూ రిలీజ్ కాలేదు.
‘నా తప్పు ఏమున్నదబ్బా..’ అంటూ సాగే ఆ సాంగ్ మాత్రం అబ్బో.! పిచ్చ ఫేమస్ అయ్యిందిలే. ఏమో, ఇప్పుడు బోయపాటి సినిమాతో అయినా ఊర్వశి రౌతెలా తెలుగులో పాగా వేస్తుందేమో చూడాలి మరి. అన్నట్లు రీసెంట్గా ‘ది లెజెండ్’ సినిమాలో ఊర్వశి హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు







