సుధీర్ బాబు కొత్త సినిమా.! కాన్సెప్ట్ ఏంటో తెలుసా.?
- October 27, 2022
కంటెంట్ వున్న సినిమాలకే సుధీర్ బాబు ప్రాధాన్యత ఇస్తూ వస్తాడు. ఆయన సినిమాకి కథే హీరో.అయితే, ఈ మధ్య సుధీర్ బాబు ఎంచుకుంటున్న కథలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయనే ఆరోపణ వుంది.
రీసెంట్‌గా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో ఓ ఫెయిల్యూర్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు సుధీర్ బాబు. ఆ తర్వాత ‘హంట్’ అనే మూవీతో రాబోతున్నాడు. తాజాగా మరో సినిమాని లైన్‌లో పెట్టేశాడీ విలక్షణ హీరో.
‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాని అనౌన్స్ చేస్తూ, రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ఓ ఇన్‌లాండ్ లెటర్‌తో కూడిన ఫస్ట్ లుక్ అది. 19ల కాలం నాటి తుపాకి, సగం కాల్చి పెట్టిన సిగరెట్, పాత ల్యాండ్ లైన్ ఫోన్.. రక్తపు చుక్కలు.. ఇలా రకరకాల ఐటెమ్స్‌తో వుంది ఈ ఫస్ట్‌లుక్.
సుధీర్ బాబు పాత్ర పేరు ‘శివారెడ్డి’ అంటూ పరిచయం చేశారు. నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజక వర్గం కుప్పం బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది. ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తి క్రియేట్ చేయడంతో పాటూ, కాన్సెప్ట్ కూడా మరింత క్యూరియాసిటీ కలిగిస్తోంది. నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరగనుందట. మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







