హరమైన్ రైలు సేవలు పునఃప్రారంభం

- October 28, 2022 , by Maagulf
హరమైన్ రైలు సేవలు పునఃప్రారంభం

జెడ్డా: హరమైన్ హై స్పీడ్ రైలు సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. గత  కొంతకాలంగా టెక్నికల్ సమస్యల కారణంగా సాధారణ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కమ్యూనికేషన్ లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిచేసినట్లు అధికారులు తెలిపారు. మక్కా, మదీనాల మధ్య జెడ్డా, రబీగ్ మీదుగా తన సేవలను పునరుద్ధరించినట్లుహరమైన్ రైలును నిర్వహిస్తున్న సౌదీ-స్పానిష్ రైలు ప్రాజెక్ట్ కంపెనీ వెల్లడించింది. సేవల నిలుపుదల కారణంగా ప్రభావితమైన ప్రయాణికులందరికీ కంపెనీ క్షమాపణలు చెప్పింది. అలాగే కంపెనీ విధానాల ప్రకారం బాధితులకు పరిహారం ఇస్తామని ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా జెడ్డా, మదీనా మధ్య నిర్వహించాల్సిన అనేక ట్రిప్పులను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com