ఏపీ: ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 809 చికిత్సలు..
- October 28, 2022
అమరావతి: ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరో 809 చికిత్సలను చేరుస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా పెంచిన చికిత్సలతో ఆరోగ్య శ్రీ పథకం కింద 3,255 చికిత్సలను అందిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంలో పోలిస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అదనంగా 2,196 వైద్య చికిత్సలను చేర్చినట్లు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో సీఎం జగన్ నూతన చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం కింద అమలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ పథకం అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో కేవలం ఆరోగ్య శ్రీ కింద 1059 చికిత్సలు అందిస్తుండగా వాటిని తమ ప్రభుత్వంలో 3,255కు పెంచినట్లు వివరించారు. మే 2019 నాటికి ఆరోగ్య శ్రీ వైద్య చికిత్సల సంఖ్య 1059 ఉండగా జనవరి 2020లో 2059 పెంచామన్నారు. వైద్యం ఖర్చు 1000 రూపాయలు పైగా ఖర్చయ్యే ప్రతి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు.
జులై 2020లో 2200 వైద్య సేవలు, నవంబర్ 2020లో 2436, జూన్ 2021లో 2446 చికిత్సలు అదేవిధంగా 2022లో 3255 వైద్య చికిత్సలకు ఆరోగ్యశ్రీలో అందుబాటులోకి తేవటం జరిగిందని తెలిపారు. గత టీడీపీ హయాంలో 2018–19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లుగా ఉందని సీఎం జగన్ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం కన్నా మూడు రెట్లు అధికంగా వైసీపీ హయాంలో ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!
- యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!









