నవంబర్ 9 నుండి ప్రీమియర్ ఎయిర్ షో
- October 29, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో (BIAS) 2022 ఆరవ ఎడిషన్ నవంబర్ 9 నుండి 11 వరకు సఖిర్ ఎయిర్ బేస్‌లో జరుగనుంది. బహ్రెయిన్ ప్రీమియర్ ఏవియేషన్ షో సందర్భంగా కుటుంబాల కోసం వినోదభరితమైన ప్రత్యేక వినోద కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మూడు రోజుల సాగే ఈ ఎయిర్ షో.. అంతర్జాతీయ ఈవెంట్‌ల శ్రేణిలో మైలురాయిగా నిలుస్తుందని హిస్ మెజెస్టి కింగ్ వ్యక్తిగత ప్రతినిధి, BIAS సుప్రీం ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ హిస్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్ ఖలీఫా తెలిపారు.
మూడు రోజుల ఈవెంట్
మూడు రోజుల ఈవెంట్‌లో ఫ్యామిలీ ఏరియా జోన్ ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. సందర్శకులు ఎయిర్‌షోతో పాటు వివిధ కార్యకలాపాలను ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. యూకే రాయల్ ఎయిర్ ఫోర్స్ ఏరోబాటిక్ టీమ్, రెడ్ యారోస్, ఎయిర్‌బోర్న్ ఫైరోటెక్నిక్స్ బాణాసంచాతో గ్లోబల్ స్టార్ డే, ఈవెనింగ్ ఎయిర్ డిస్‌ప్లేలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అశ్విక దళ బృందం నిర్వహించే కార్యక్రమాలను సందర్శకులు ఆస్వాదించవచ్చు. విద్యా మంత్రిత్వ శాఖ, క్లీవర్ ప్లే సహకారంతో 8 - 12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల కోసం విద్యా, వినోద వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించనున్నారు. 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి కుటుంబ ప్రాంత టిక్కెట్‌ల ధర రోజుకు BD5 కాగా.. 12 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. ఎయిర్‌షో టిక్కెట్‌లను బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో వెబ్‌సైట్‌తోపాటు అన్ని బహ్రెయిన్ పోస్ట్ అవుట్‌లెట్లలో విక్రయించబడతాయని లేదా సఖిర్‌లోని ఈవెంట్ జరిగే చోట నేరుగా కొనుగోలు చేయవచ్చు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







