కన్నడ రాజ్యోత్సవం.. ఎన్టీఆర్ కు సీఎం బసవరాజ్ బొమ్మై ఆహ్వానం
- October 29, 2022
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో నవంబర్ 1న జరగనున్న కన్నడ రాజ్యోత్సవం కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కార్యాలయం శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ కార్యక్రమంలో ఇటీవలే మరణించిన పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక సర్కారు ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారం కర్ణాటక రత్న అవార్డును అందజేయనుంది. ఈ వేడుకకు రావాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ను బసవరాజ్ బొమ్మై ఆహ్వానించగా… అందుకు జూనియర్ ఎన్టీఆర్ సమ్మతించారు.
కాగా, ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పునీత్ రాజ్ కుమార్ కుటుంబం కూడా హాజరు కానుంది. పునీత్ రాజ్ కుమార్ తో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి స్నేహమే ఉన్న సంగతి తెలిసిందే. పునీత్ మరణించిన సందర్భంగా ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పునీత్ కు అవార్డు ఇస్తున్న కార్యక్రమానికి ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలగిన ప్రముఖులను ఆహ్వానించాలని కర్ణాటక సర్కారు భావించి…జూనియర్ ఎన్టీఆర్ ను ఈ వేడుకకు ఆహ్వానించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







