సౌదీలో అతి పెద్ద డ్రైవింగ్ స్కూల్ మక్కాలో ఏర్పాటు
- October 29, 2022
మక్కా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (మురూర్) పర్యవేక్షణలో సౌదీ అరేబియాలోని అతిపెద్ద డ్రైవింగ్ స్కూల్ త్వరలో మక్కాలో ఏర్పాటు చేయనున్నారు. డ్రైవింగ్ స్కూల్ ప్రాజెక్ట్ 200,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్ట్ అమలు ప్రారంభమైన 8 నెలల్లోపు పూర్తవుతుందని సౌదీ అరేబియాలోని డ్రైవింగ్ పాఠశాలల పర్యవేక్షకుడు ఇంజినీర్ రామి యాగ్మౌర్ తెలిపారు. మక్కాలో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్ట్ సౌదీ అరేబియాలో ఇదే మొదటిదని, అతిపెద్ద డ్రైవింగ్ స్కూల్ అని పేర్కొన్నారు. ఇక్కడ సాధారణ కార్లను నడపడం నేర్పించడమే కాకుండా అంబులెన్స్‌లు, పోలీసు, అగ్నిమాపక వాహనాల వంటి ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే వాహనాల ప్రొఫెషనల్ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణా ట్రాక్‌ల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మోటార్ సైకిళ్లు, టాక్సీలు, బస్సులు, తేలికపాటి, భారీ రవాణా ట్రక్కుల కోసం ప్రత్యేక శిక్షణా ట్రాక్‌లు ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







