సౌదీలో అతి పెద్ద డ్రైవింగ్ స్కూల్ మక్కాలో ఏర్పాటు

- October 29, 2022 , by Maagulf
సౌదీలో అతి పెద్ద డ్రైవింగ్ స్కూల్ మక్కాలో  ఏర్పాటు

మక్కా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (మురూర్) పర్యవేక్షణలో సౌదీ అరేబియాలోని అతిపెద్ద డ్రైవింగ్ స్కూల్ త్వరలో మక్కాలో ఏర్పాటు చేయనున్నారు. డ్రైవింగ్ స్కూల్ ప్రాజెక్ట్ 200,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్ట్  అమలు ప్రారంభమైన 8 నెలల్లోపు పూర్తవుతుందని సౌదీ అరేబియాలోని డ్రైవింగ్ పాఠశాలల పర్యవేక్షకుడు ఇంజినీర్ రామి యాగ్‌మౌర్ తెలిపారు. మక్కాలో ఏర్పాటు చేయనున్న ప్రాజెక్ట్ సౌదీ అరేబియాలో ఇదే మొదటిదని, అతిపెద్ద డ్రైవింగ్ స్కూల్ అని పేర్కొన్నారు. ఇక్కడ సాధారణ కార్లను నడపడం నేర్పించడమే కాకుండా అంబులెన్స్‌లు, పోలీసు, అగ్నిమాపక వాహనాల వంటి ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే వాహనాల ప్రొఫెషనల్ డ్రైవర్‌లకు ప్రత్యేక శిక్షణా ట్రాక్‌ల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మోటార్ సైకిళ్లు, టాక్సీలు, బస్సులు,  తేలికపాటి, భారీ రవాణా ట్రక్కుల కోసం ప్రత్యేక శిక్షణా ట్రాక్‌లు ఉన్నాయన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com