రన్‌కువైట్ 10వ ఎడిషన్ విజయవంతం
- October 30, 2022
కువైట్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఆదుకోవడానికి ఫౌజియా సుల్తాన్ హెల్త్‌కేర్ నెట్‌వర్క్ (FSHN), మల్టీడిసిప్లినరీ నాన్-ప్రాఫిట్ హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన రన్‌కువైట్ 10వ ఎడిషన్ విజయవంతమైంది. ‘‘ప్రతి సంవత్సరం మేము ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం రన్‌కువైట్ అనే ఛారిటీ రేస్‌ను నిర్వహిస్తాము. ఫౌజియా సుల్తాన్‌లో సేవలను పొందడానికి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు మేము రన్నర్స్, పార్టిసిపెంట్‌ల నుండి విరాళాలు సేకరిస్తాము.” అని ఎఫ్‌ఎస్‌హెచ్‌ఎన్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ మేనేజర్ అన్నే మేరీ బాటెర్రానీ అన్నారు. ఈ సంవత్సరం నిర్వహించిన రన్ కువైట్ లో దాదాపు 1,500 మంది పాల్గొన్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌లో భాగమైన ప్రతిఒక్కరికి మేరీ బాటెర్రానీ కృతజ్ఞతలు తెలిపారు. FAWSEC ఎడ్యుకేషనల్ సంస్థకు అనుబంధంగా ఉన్న అల్-బయాన్ ద్విభాషా స్కూల్, అల్-బయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో రన్ కువైట్ లో పాల్గొన్నారని ఆయా విద్యా సంస్థల డైరెక్టర్ మనల్ అల్-షాక్షీర్ తెలిపారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడంతోపాటు ప్రత్యేక అవసరాల పిల్లల కోసం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు మద్దతు ఇచ్చేందుకు ఏటా రన్ కువైట్ ని నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్‌లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









