షార్జా టాక్సీలో 65% పెరిగిన హైబ్రిడ్ వాహనాలు

- October 30, 2022 , by Maagulf
షార్జా టాక్సీలో 65% పెరిగిన హైబ్రిడ్ వాహనాలు

షార్జా: ఇంధనం, విద్యుత్ రెండింటిలోనూ పనిచేసే హైబ్రిడ్ వెహికల్ ఫ్లీట్ కార్ల సంఖ్యను పెంచాలని షార్జా టాక్సీ, షార్జా ప్రభుత్వ పెట్టుబడి విభాగం, షార్జా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అనుబంధ సంస్థలు నిర్ణయించాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో షార్జా టాక్సీ తన వాహన సముదాయంలో 65% వరకు హైబ్రిడ్ వాహనాలను చేర్చింది. దీంతో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించినట్లు షార్జా టాక్సీ పేర్కొంది. కంపెనీ మొత్తం కార్ల సముదాయంలో 100% హైబ్రిడ్ వాహనాలను చేర్చేడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు షార్జా టాక్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖలీద్ అల్ కిండి తెలిపారు. షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, షార్జా సిటీలో పనిచేస్తున్న షార్జా టాక్సీ ఫ్లీట్‌లో 60% ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి పర్యావరణ అనుకూల హైబ్రిడ్ వాహనాలుగా మార్చాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com