సౌదీ పెరుగుతున్న విడాకులు: ప్రతి గంటకు 7 కేసులు
- October 30, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో విడాకుల రేటు క్రమంగా పెరుగుతోంది. ప్రతిరోజూ 168 కేసులు నమోదవుతుండగా.. సగటున ప్రతి గంటకు 7 విడాకుల కేసులు వస్తున్నాయి. సౌదీ జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. 2020 చివరి కొన్ని నెలల్లో 57,595 విడాకుల డిక్రీలు జారీ చేయబడ్డాయి. 2019తో పోలిస్తే 12.7 శాతం పెరిగాయి. అయితే విస్తృతమవుతున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సౌదీ న్యాయవాది దఖిల్ అల్ దఖిల్ మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో విడాకుల కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. 2010లో కేవలం 9,233 కేసులు మాత్రమే ఉండగా.. 2011లో ఆ సంఖ్య 34 వేలకు చేరాయన్నారు. ఆ తర్వాతి సంవత్సరాలలో విడాకుల కేసులు 57 వేలకు చేరాయని వివరించారు. 2020లో రాజ్యంలో ప్రతి గంటకు 7 విడాకుల కేసులు నమోదవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. సౌదీ సమాజంలో పెరుగుతున్న విడాకుల కేసుల సంఖ్య పెరగడానికి 2019లో వచ్చిన కోవిడ్-19 మహమ్మారి కారణమని అల్ దఖిల్ పేర్కొన్నాడు. సౌదీ కుటుంబాలను. అరబ్ కుటుంబాలను నాశనం చేయడంలో మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఇతర కారణాలలో సామాజిక వ్యత్యాసాలు, జీవితంలో అసమాన లక్ష్యాలు, ప్రాధాన్యతలు, అలాగే సాంస్కృతిక అసమానతలు ఉన్నాయని అల్ దఖిల్ వివరించారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్‌లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









