వ్యవసాయం, ఆహార భద్రతపై ఒమన్- ఇండియా పెట్టుబడులు
- October 31, 2022
మస్కట్: ఒమన్ విజన్ 2040లో భాగంగా ఆర్థిక వైవిధ్యీకరణపై ఒమన్ సుల్తానేట్ దృష్టి సారించింది. వ్యవసాయం, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ సహకారంతో ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI), ఒమానీ-ఇండియన్ బిజినెస్ ఫోరమ్ సమావేశం నిర్వహించింది. ఆహార భద్రత, వ్యవసాయం, ఇతర రంగాలలో ఒమన్, ఇండియా మధ్య పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని ఫోరంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్ ఎంగ్ రిదా బిన్ జుమా అల్ సలేహ్ మాట్లాడుతూ..ఫోరమ్ ద్వైపాక్షిక సమావేశాలు ఒమన్, భారతదేశం మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేస్తాయన్నారు. ఆహార భద్రత, వ్యవసాయం, ఇతర ఆశాజనక రంగాలలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రెండు స్నేహపూర్వక దేశాల మధ్య వాణిజ్య మార్పిడి పరిమాణం జూన్ 2022 చివరి వరకు OMR2 బిలియన్లకు పైగా ఉందని, భారతదేశం నుండి ఒమానీ దిగుమతుల విలువ OMR793.47 మిలియన్లను అధిగమించిందన్నారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో భారతీయ పెట్టుబడులు 2020 సంవత్సరంలో వివిధ రంగాలలో ప్రత్యక్ష పెట్టుబడులుగా OMR12 బిలియన్లకు చేరాయని అల్ సలేహ్ చెప్పారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని భారత రాయబారి అమిత్ నారంగ్ మాట్లాడుతూ.. ఈ ఫోరమ్ రెండు స్నేహపూర్వక దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!







