వ్యక్తి చేతిలో గాయపడ్డ మహిళకు Dh20,000 పరిహారం
- October 31, 2022
అబుధాబి: ఒక మహిళపై దాడి చేసి మానసికంగా హింసించిన వ్యక్తికి కోర్టులో చుక్కెదురైంది. మానసికంగా క్షోభను అనుభవించిన మహిళకు పరిహారంగా 20,000 దిర్హామ్‌లు చెల్లించాలని కోర్టు సదరు వ్యక్తిని ఆదేశించింది. అంతకుముందు ఆ మహిళ ఆ వ్యక్తిపై అల్ ఐన్ సివిల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో దావా వేసింది.తాను అనుభవించిన భౌతిక, నైతిక నష్టాలకు పరిహారంగా తనకు Dh100,000 చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. నిందితుడు తనను తీవ్రంగా కొట్టాడని, దాని వల్ల తన నుదిటి, ఎడమ చేయి, శరీరంలోని ఇతర భాగాలకు గాయాలయ్యాయని తన వ్యాజ్యంలో పేర్కొంది. ఈ ఘటన తర్వాత తాను 20 రోజులకు పైగా పని చేయకుండా ఉండిపోయినట్లు వివరించింది. అంతకుముందు అతడిని ఇదే కేసులో క్రిమినల్ కోర్టు దోషిగా నిర్ధారించి 3,000 దిర్హామ్‌ల జరిమానా విధించింది. అన్ని పక్షాల నుండి విన్న తర్వాత, సివిల్ కోర్టు న్యాయమూర్తి బాధితురాలికి 20,000 దిర్హామ్‌లు చెల్లించాలని ప్రతివాదిని ఆదేశిస్తూ తీర్పును జారీ చేశారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్‌సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







