ఉక్రెయిన్‌పై రష్యా క్షిప‌ణి దాడులు..

- October 31, 2022 , by Maagulf
ఉక్రెయిన్‌పై రష్యా క్షిప‌ణి దాడులు..

కివ్: ఉక్రెయిన్ పై రష్యా క్షిప‌ణుల‌తో దాడి చేసింది. రాజ‌ధాని కీవ్‌తో పాటు ప‌లు న‌గ‌రాల్లో విద్యుత్తు, నీటి స‌ర‌ఫ‌రా నిలిపోయిన‌ట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్ల‌డించారు. కీవ్‌లో రెండు చోట్ల పేలుళ్లు జ‌రిగాయి. కీవ్ జిల్లాలో విద్యుత్తు స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌డం లేదు. ఖార్కీవ్ న‌గ‌రంలో కీల‌క కేంద్రాల‌ను టార్గెట్ చేశారు. క్రిమియాలోని న‌ల్ల‌స‌ముద్రం ద‌ళంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ర‌ష్యా మిస్సైల్‌ను ఫైర్ చేసింది.

సోమ‌వారం ఉద‌యం విన్నిసియా ప్రాంతంపై కూడా దాడి జ‌రిగింది. జ‌పొరిజియా ప్రాంతంలో ఉన్న హైడ్రోఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్‌పై కూడా దాడి జ‌రిగింది. కీవ్‌లో సుమారు 3.5 ల‌క్ష‌ల మందికి స‌ర‌ఫ‌రా అయ్యే విద్యుత్తుకు కూడా అంత‌రాయం ఏర్ప‌డింది. తాజా దాడుల్లో ఎంత మంది మ‌ర‌ణించార‌న్న విష‌యం ఇంకా తెలియ‌లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com