‘ఖేద్మా’ ద్వారా ట్రాఫిక్ జరిమానాల చెల్లింపు సేవలు
- November 02, 2022
మస్కట్: ఒమన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ‘ఖేద్మా’ ప్లాట్‌ఫారమ్ ద్వారా అనేక వాహన సంబంధిత సేవలను అందించడానికి సంబంధించి ఒక ఒప్పందంపై రాయల్ ఒమన్ పోలీస్ (ROP) సంతకం చేసింది. పౌరులకు, నివాసితులకు ఒకే విధంగా సేవలను అందించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో ఈ ఒప్పందం భాగమని ఆర్ఓపీ పేర్కొంది. ఒప్పందంపై అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ అఫైర్స్( ROP) మేజర్ జనరల్ ఖలీఫా బిన్ అలీ అల్ సియాబీ, ఒమన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ సీఈఓ సెయిడ్ బిన్ అహ్మద్ సఫ్రార్ సంతకం చేశారు. ఒప్పందం మొదటి దశలో ఖేద్మా ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలు, ముల్కియా ప్రింటింగ్ సేవల చెల్లింపు సేవలను అందిస్తుందని ఆర్ఓపీ తెలిపింది. ఒమన్‌లోని 68 శాఖలు, బిల్లు చెల్లింపు యంత్రాలు, ఖేద్మా యాప్, కంపెనీ వెబ్‌సైట్‌తో సహా ఖేద్మా వివిధ ఛానెల్‌ల ద్వారా ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







