మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు భారీ బందోబస్తు: సీపీ మహేశ్ భగవత్
- November 02, 2022
తెలంగాణ: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రేపు జరగబోతుంది.ఈ క్రమంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పటు చేస్తున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. సుమారు 2వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామన్నారు.ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీసం తొమ్మిది మంది సిబ్బంది ఏర్పటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్న ఆయన.. చెక్ పోస్టులు గురువారం ఎన్నికలు ముగిసే వరకు ఉంటాయని స్పష్టం చేశారు.గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిని బైండోవర్ చేశామని, ఇప్పటి వరకు రూ.4కోట్ల నగదును సీజ్ చేసినట్లు వివరించారు.
మునుగోడు నియోజకవర్గంలో రేపు ఉదయం 7 గంటలకు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నెల 6న ఓట్లను లెక్కించనున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఉపఎన్నికను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు.

తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







