IIIT శ్రీ సిటీలో ఉద్యోగాలు...
- November 03, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీలో ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్ (ఇంగ్లిష్) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఇంగ్లిష్ స్పెషలైజేషన్‌లో పీజీ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తుల చేసుకునేందుకు అర్హులు. అలాగే మూడేళ్ల టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి. ఎంఫిల్ అర్హత కలిగిన వారికి రెండేళ్ల టీచింగ్ అనుభవం, పీహెచ్డీ అర్హత కలిగిన వారికి ఏడాది టీచింగ్ అనుభవం ఉండాలి.
అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్ 19, 2022వ తేదీలోపు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపిచాల్సి ఉంటుంది. నవంబర్ 15వ తేదీలోపు దరఖాస్తులను మెయిల్ ద్వారా పంపాలి. ఈమెయిల్ ఐడీ: [email protected], దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : రిజిస్ట్రార్ I/C. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీ సిటీ, చిత్తూరు 630 జ్ఞాన్ మార్గ్, శ్రీ సిటీ, తిరుపతి జిల్లా – 517 646, ఆంధ్రప్రదేశ్, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iiits.ac.in/careersiiits/
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







