అప్పుల బాటలో సౌదీ అరేబియా
- April 21, 2016
దాదాపు దశాబ్దం తర్వాత సౌదీఅరేబియా మొదటిసారి రుణం కోసం ప్రయత్నిస్తోంది. ఎంత మొత్తం రుణం తీసుకోనుంది అన్నదానిపై స్పష్టత లేకపోయినా దాదాపు 6 బిలియన్ డాలర్ల నుంచి 8 బిలియన్ డాలర్లు రుణం తీసుకోవచ్చని సమాచారం. ఐదేళ్ల కాలపరిమితితో అమెరికన్ డాలర్ల రూపంలో తీసుకునే రుణానికి సంబంధించి రుణదాతలు ప్రతిపాదనలు పంపించాలని రియాద్ వర్గాలు కోరాయి. చమురు ధరలు పడిపోవడంతో బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు ఈ రుణం తీసుకోనుంది.
సౌదీ అరేబియా బడ్జెట్ లోటు గత ఏడాదితో 100 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనిని పూడ్చుకునేదుకు విదేశాల్లోని ఆస్తులను విక్రయించడం, బాండ్లను పంపిణీ చేయడం వంటి చర్యలు చేపట్టింది. వీటిల్లో కూడా కొన్ని సమస్యలు ఎదురవ్వడంతో రుణంవైపు మొగ్గు చూపింది. దీనికి సంబంధించి సిటీగ్రూప్తోపాటు మరి కొన్ని సంస్థలు సౌదీ ప్రభుత్వానికి సలహాదార్లుగా వ్యవహరిస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







